చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

విశ్వంభర, పెద్ద శంకరంపేట:  ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్ లు అన్నారు. మంగళవారం పెద్ద శంకరంపేటలోని పోలీస్ స్టేషన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని వాటికి అనుగుణంగా మెలగాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను కాపాడుకోవాలి అన్నారు. రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ చంద్రమోహన్, పోలీసు సిబ్బంది. గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags: