08 సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలి 

08 సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలి 

విశ్వంభర, కందుకూరు : కందుకూరు మండల కేంద్రంలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న 108  అంబులెన్స్ ను  జిల్లా  అంబులెన్స్ నిర్వహణ అధికారి  రాజబాబు మంగళవారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ,  108 సేవలు ప్రజలకు అందుబాటులో సరైన టైంలో  వైద్యం అందిస్తున్నారా.. లేదా.. అని అడిగి తెలుసుకున్నారు. 108  అంబులెన్స్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని,  ఒక ప్రాణాన్నినిలబెట్టడం ఎంతో ముఖ్యం, 108 సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి  ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. సిబ్బంది హాజరు వారి పనితీరు పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా విధానాన్ని పరిశీలించారు, మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అత్యవసర సమయంలో ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి పేషెంట్ వద్దకు చేరుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో  సురేందర్, షఫీ, పాల్గొన్నారు.

Tags: