#ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ అవార్డులు
విశ్వంభర, జిహెచ్ఎంసి : విధి నిర్వహణలో చురుకుదనం, అంకితభావాన్ని ప్రదర్శించినందుకుగాను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పది మంది ఉద్యోగులకు “ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే (ఎస్.సి.ఆర్ ) సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ తోపాటు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, ఆరు డివిజన్లు అనగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్‌లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జోన్ పరిధిలోని వివిధ డివిజన్ లకు చెందిన ట్రాక్ నిర్వహకులు, పాయింట్స్‌మెన్, సాంకేతిక నిపుణులు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు మరియు లోకో పైలట్లతో సహా క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతలను అభినందిస్తూ, ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడంలో చూపిన అంకితభావాన్ని, చిత్తశుద్ధిని ప్రశంసించారు. ఇటువంటి గుర్తింపు ఇతర ఉద్యోగులను కూడా అప్రమత్తంగా ఉండటానికి, రైలు కార్యకలాపాలలో భద్రతా ప్రమాణాలను పాటించడానికి ప్రేరేపిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో శ్రీవాస్తవ అధికారులను పనిస్థలాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి షార్ట్‌కట్‌లను అనుసరించవద్దని /పాటించవద్దని/ ఆశ్రయించవద్దని ఆదేశించారు. అధికారులు మరియు పర్యవేక్షకులు సిబ్బంది అప్రమత్తతపై, అలాగే నిర్దేశించిన విధానాలను అనుసరించడంపై దృష్టి పెట్టి, క్రమం తప్పకుండా భద్రతా డ్రైవ్‌లు నిర్వహించాలని ఆయన సూచించారు. పనిస్థలాలు మరియు నిర్మాణ స్థలాల్లో నియమాలు పాటిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీలు కూడా తప్పనిసరి చేశారు. తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.



