రామన్నపేటలో విచ్చలవిడిగా నకిలీ సిగరెట్ల దందా

రామన్నపేటలో విచ్చలవిడిగా నకిలీ సిగరెట్ల దందా

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రం లో గత కొంతకాలంగా అనుమతి లేని, నాణ్యతలేని నకిలీ సిగరెట్లు విచ్చలవిడిగా మార్కెట్లో చలామణి అవుతున్నాయి.కొన్ని అసాంఘిక శక్తులు అసలు బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకెట్లను మార్కెట్లోకి తెచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి.ఈ నకిలీ సిగరెట్లలో వాడే పొగాకు, ఇతర రసాయనాలు ప్రమాదకరమైనవి వీటిని తాగడం వల్ల ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు తీవ్ర హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా యువత ఈ తక్కువ ధరల నకిలీ ఉత్పత్తులకు ఆకర్షితులై అనారోగ్యాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.ఈ నకిలీ ఉత్పత్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.అసలు సిగరెట్ కాల్చడమే ఆరోగ్యానికి హానికరం అంటే అందులోను నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తుంటే వాటిలో అసలేదో,నకిలీ ఏదో  తెలియకుండానే ప్రజలు కొనడం మూలాన తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి అక్రమ వ్యాపారాలు అరికట్టడంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలోని కిరాణా దుకాణాలు మరియు ఇతర విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి నకిలీ సిగరెట్ల విక్రయాలను అరికట్టాలని, అంతేకాకుండా మార్కెట్లో లభించే నకిలీ నిత్యవసర వస్తువులపైన కూడా ఒకసారి దృష్టి పెట్టి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారుల తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Tags: