పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి తొలగింపు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రం లోని పదవ తరగతి పరీక్ష కేంద్రం మోడల్ స్కూల్ లో చీఫ్ సూపరింటెండెంటుగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ ఇ.గోపి గణితం పరీక్ష రోజు ఒక విద్యార్థి పరీక్ష హాల్లోకి ఫోన్ తీసుకెళ్లిన విషయం విద్యార్థి ఫోన్ రింగ్ కావటం వలన గుర్తించి అతని నుంచి ఫోన్ తీసుకొని పోలీసు స్టేషనులో అప్పగించడం జరిగింది, పరీక్ష హాల్లోకి వెళ్ళే ముందు ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాల్సి వుంటుంది, పరీక్షల విధుల్లో ఉన్న అధికారుల నిర్లక్ష్యం వలన ఈ సంఘటన జరిగిందని ధ్రువీకరించారు. అదే విధంగా ఈ విషయాన్ని చీఫ్ సూపరింటెండెంట్ ఇ.గోపి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకపోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పీవీ శ్రీహరి అతనిని పరీక్షల విధుల్లోంచి తొలగించి షోకాజ్ నోటీసులు జారీ చేయమని డిఈవో కి ఆదేశాలు జారీ చేశారు. ఇ.గోపి స్థానంలో సీనియర్ టీచర్ అంబిక చీఫ్ సూపరింటెండెంటుగా విధులు నిర్వహిస్తున్నారు, జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలానుసారం నోటీసుకి వివరణ అందిన తర్వాత విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి పత్రిక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పరీక్షల విధుల్లో సైతం నిర్లక్ష్యం వహించినందుకు ఇరవై రోజుల క్రితం విధుల్లో నుంచి తప్పించారు,



