ధాన్యం ఆరబోతకు జెసిబి తో చదును

ధాన్యం ఆరబోతకు జెసిబి తో చదును

విశ్వంభర, నెల్లికుదురు: రైతులు ధాన్యం, ఇతర పంటలు ఆరబోసేందుకు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలోని మార్కెట్ స్థలాన్ని జెసిబి యంత్రంతో ముళ్ళ కంప చెట్లు తొలగించి చదును చేస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచి డా.చిర్ర యకాంతం గౌడ్ తెలిపారు. సంబంధిత స్థలంలో ముళ్ళ చెట్లు, కంప పొదలు ఉండడంతో కోతుల కు స్థావరం గా మారిందని,వానరాల బెడదతో రైతులు తమ పంటలను ఆరబోసుకోకుండా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాబోయే వేసంగి పంటలను మార్కెట్ స్థలానికి రైతులు తీసుకు వస్తారని ముందస్తుగా చదును చేసి రాత్రి వేళలో సైతం వెలుతురు ఉండేందుకు లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ సైతం ఉండే విధంగా నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచి వివరించారు.

Tags: