తుమ్మలూరు గ్రామంలో  పర్యటించిన అధికారులు  

తుమ్మలూరు గ్రామంలో  పర్యటించిన అధికారులు  

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామపంచాయతీ పరిధిలో ప్రాజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు నేపథ్యంలో జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి  సుభాషిణి రెడ్డి, అడిషనల్ డీఆర్‌డీఓ గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని నర్సరీ, రహదారులు, టీకేపీ పనులు, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త వర్గీకరణ కేంద్రం, పిపివి, జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాల  పీహెచ్‌సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లను సమగ్రంగా పరిశీలించారు. ఇంటింటికి  తిరిగి చెత్త సేకరణ గురించి అవగాహన కల్పించారు.  అనంతరం ఎంపీడీఓ , ఎమ్మార్వో , శ్రీష్కతి బిల్డింగ్ ,న్రేగ్స్ ఆఫీస్ నందు పెండింగ్ పనులు, సానిటేషన్ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ పరిశీలనలో అడిషనల్ డీఆర్‌డీఓతో పాటు ఎంపీడీఓ  శైలజా రెడ్డి, డీఎల్పీఓ శ్రీ సాంబి రెడ్డి, ఎంపీవో  రవీందర్ రెడ్డి, ఏపీఓ పరిమళ, ఈసీ, టీఏలు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, పంచాయతీ కార్యదర్శి, అలివేలు, గ్రామస్తులు తదితరులు  పాల్గొన్నారు.

Tags: