'మహాలక్ష్మి'ద్వారా పదివేల కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా 

'మహాలక్ష్మి'ద్వారా పదివేల కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా 


  • : ఎమ్మెల్యే బిఎల్ ఆర్

 విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్ లో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల ఉచిత ప్రయాణాల ద్వారా 10వేల కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా  చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శుభాకాంక్షలు కార్యక్రమంలో మిర్యాలగూడ  శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి  మహిళా ప్రయాణికులకు, సహకార సంఘం మహిళలను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు.  మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించడం ద్వారా నేడు మహిళలకు బడికి, గుడికి, హాస్పిటల్ కి ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఆర్ధిక ఇబ్బంది లేకుండా ధైర్యంగా ప్రయాణం చేస్తున్నారు అని అన్నారు. అదేవిధంగా మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలు అందించడమే కాక, వారికి పెట్రోల్ బంక్ లు , ఆర్టీసీ  బస్సులు అందజేసి వారికి అండగా నిలబడుతుంది అని అన్నారు. మహిళలు అందరూ ప్రజా ప్రభుత్వం తో  కలిసి పనిచేస్తూ ఇందిరమ్మ రాజ్యం నిర్మాణంలో భాగస్వామ్యులు అవ్వాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, టౌన్ ప్రెసిడెంట్ నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ జావీద్, ఆర్టీసీ  అధికారులు, ఉద్యోగులు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

Tags: