అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
On
విశ్వంభర, నెల్లికుదురు: చికిత్స పొందుతూ అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని రాజుల కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాలు ప్రకారం, రాజుల కొత్తపల్లి గ్రామానికి చెందిన వరిపల్లి రాములు(45) వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడు రాములు ను మండలంలోని భగ్న తండా కు చెందిన భూక్య విజయ్ కుమార్ తన భార్యతో ఏదో సంబంధమున్నదని మనసులో అనుమానం పెట్టుకొని రాములను ఇష్టం వచ్చినట్లు తిట్టి,చంపుతానని బెదిరించడం కారణంగానో మరే ఇతర కుటుంబ కారణాల వలన మృతుడు పురుగుల మందు తాగి చనిపోయాడు. రాములు మరణం పై అనుమానం ఉందని మృతుని అల్లుడు చినూరి మధుకర్ ఫిర్యాదు చేయగా ఈ మేరకు నెల్లికుదురు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



