24న జిల్లా న్యాయవాద సహకార సొసైటీ ఎన్నికలు

24న జిల్లా న్యాయవాద సహకార సొసైటీ ఎన్నికలు

విశ్వంభర, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరస్పర సహకార సొసైటీ  నూతన కార్యవర్గం ఎన్నికలు ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించబడుతున్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి, న్యాయవాది  మల్లెపూల జగన్మోహన్ గౌడ్ సహాయ ఎన్నికల అధికారి పులి జైపాల్ తెలిపారు.  12 డైరెక్టర్లకు  గాను నిజామాబాద్ చెందిన 4 నాలుగు డైరెక్టర్ పోస్ట్ లకు ఎన్నికల నామినేషనల పుత్రాల స్వీకరణ ఏప్రిల్ 15,  16తేదీలలో జిల్లా కోర్టు ఆవరణలో లోని సొసైటీ కార్యాలయంలో స్వీకరించబడుతుందని 17వ తేదీన నామినేషన్ పరిశీలన, 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణ  అవకాశం ఉంటుందని 20 తేదీరోజు సాయంత్రం 5 గంటలకు అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని, ఏప్రిల్ 24వ తేది నాలుగు డైరెక్టర్ పోస్ట్ లకు ఎన్నికలు నిర్వహిస్తామని అదే రోజు డైరెక్టర్ల ఎన్నిక అనంతరం పూర్తిస్థాయి సొసైటీ కార్యవర్గాన్ని ఎన్నిక చేయడం జరుగుతుంది వారు తెలిపారు కనుక  నిజామాబాద్ జిల్లాలోని  సహకార సొసైటీ న్యాయవాద సభ్యులందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Tags: