నోట్ బుక్స్ వితరణ

నోట్ బుక్స్ వితరణ

విశ్వంభర,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన గంజి శ్రీనివాస్ రెడ్డి సోదరులు తమ మాతృమూర్తి స్వర్గీయ గంజి ఉపేంద్రమ్మ 6వ వర్ధంతి పురస్కరించుకొని మంగళవారం స్థానిక హై స్కూల్ బాలబాలికలకు అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. హనుమకొండలోని ఓయాసిస్ అనాధ ఆశ్రమంలో అనాధలకు అన్నవితరణ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రూపారాణి మాట్లాడుతూ, మాతృమూర్తి యాదిలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags: