సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ 

సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ 

విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని సబ్ జైలు,  బాలల సదనము(బాలుర)లను  జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి  శాలిని షాకెళ్లి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు .ముందుగా సబ్ జైలును సందర్శించిన కార్యదర్శి  జ్యూడిషల్ నిర్భంధం లో ఉన్నటువంటి మహిళలతో ముఖాముఖి మాట్లాడారు .  జైలులో వారికి అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు ,  మరియు ఇతర మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని మాట్లాడుతూ  న్యాయవాది,  లేని వారికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని ఖైదీలకు  హామీ ఇచ్చారు . అనంతరం ప్రభుత్వ బాలల సదనాన్ని సందర్శించి, పిల్లలతో కాసేపు గడిపారు . మరియు పిల్లలకు అందిస్తున్న విద్యాబోధన, పౌష్టికాహారం , మరియు భద్రతపై ఆరా తీశారు . ​వంటశాల మరియు నివాస గదులను పరిశీలించి, పరిశుభ్రత ,    విషయంలో రాజీ పడకూడదని పలు సూచనలు  సూచించారు . ​పిల్లల మానసిక వికాసం కోసం క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ,  నిర్వహించాలని సంబంధిత అధికారులకు తెలిపారు . ​పిల్లలకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వారి ఉజ్వల భవిష్యత్తుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ  అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు .

Tags: