ఏటీసీ కోసం అధికారులు స్థల పరిశీలన

ఏటీసీ కోసం అధికారులు స్థల పరిశీలన

విశ్వంభర,ఇనుగుర్తి: ప్రభుత్వం ఇనుగుర్తి మండలానికి మంజూరు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటిసి) ఏర్పాటు కోసం అధికారులు మంగళవారం ఇనుగుర్తిలో క్షేత్రస్థాయిలో సైట్ విజిట్ చేశారు. తహసిల్దార్ సుంకరి శ్రీనివాస్ నేతృత్వంలో స్థానికస్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, ఏటీసీ ఇంచార్జ్,ట్రైనింగ్ ఆఫీసర్ ఎన్. మల్లేశం,ఐటిఐ ప్రిన్సిపాల్ బాబు తదితరులు మంగళవారం స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ,  అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం కోసం ఇనుగుర్తి సమీపంలోని ప్రభుత్వ భూమి కోతుల బోడు వద్ద సర్వే నెం.1196 లోని భూమిని గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్,ఆర్ఐ బషీర్, కాంగ్రెస్ జిల్లా నేత చిన్నాల కట్టయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: