కేంద్రమంత్రులను తెలంగాణలో తిరగనివ్వం : మోత రోహిత్

కేంద్రమంత్రులను తెలంగాణలో తిరగనివ్వం : మోత రోహిత్

విశ్వంభర, నల్లకుంట : తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నేత గద్దర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు, వెంటనే బే షరతుగా క్షమాపణ చెప్పాలని ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఉద్యమ నేత గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హైదరాబాదు నల్లకుంటలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కేంద్రమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. బిజెపి కేంద్రమంత్రులను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పేర్కొంటూ, క్షమాపణ చెప్పని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ అమరులను అవమానించే చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు. బిజెపి కార్యాలయం వెళ్లే దారికి గద్దర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags: