గ్యాస్ ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే కాలేరు
On
విశ్వంభర, గోల్నాక : గోల్నాక డివిజన్‌లోని కృష్ణా నగర్ బస్తీలో ఇటీవల గ్యాస్ ప్రమాదానికి గురైన ఇళ్లను అంబర్‌పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సందర్శించారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఆయన పరామర్శించి.. వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.



