అణగారిన వర్గాల అభివృద్ధికి సర్కారు కృషి
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
విశ్వంభర, మహబూబాబాద్: అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని
రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం మహబూబాబాద్ పట్టణం లో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పరిశీలన నిమిత్తం వచ్చిన ఆయన ఇల్లందు రోడ్డులోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్, అన్ని వర్గాల పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం ప్రజా ప్రభుత్వం అని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులను వారికి కేటాయిస్తూ .. యువత విద్య అభివృద్ధి కోసం అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ప్రవేశపెట్టి ఉన్నత చదువుల కోసం విదేశాల కు పంపడం జరుగుతుందని, ఆర్థికపరంగా ఎదగడానికి చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించడం జరుగుతుందని అన్నారు,
ఎస్సీ,ఎస్టీ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన వారికి న్యాయం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతన్నాయన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పయనించి, విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. అంతకుముందు ఆయనకు మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు శ్రీనివాసరావు, దేశీ రామ్ నాయక్, తదితరులు స్వాగతం పలికారు. పట్టణంలోని 17వ డివిజన్, ఇల్లందు రోడ్డు ఎస్సీ కాలనీ సందర్శించారు. వారికి ప్రభుత్వ పరంగా అందించిన గృహాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పక్క ఇండ్లు అంతర్గత రోడ్లు కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ రాజేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



