జనగణన పకడ్బందీగా చేపట్టాలి

జనగణన పకడ్బందీగా చేపట్టాలి

  • రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి 

విశ్వంభర, హైదరాబాద్: జనాభా గణనలో ఏ ఒక్కరినీ వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిఫ్లెక్ట్ కావాలన్నారు.  క్వాలిటీ డేటా వల్ల అభివృద్ధి ప్రణాళికలు, పాలసీ ల రూపకల్పనకు, ప్రజాస్వామ్యం బలోపేతానికి క్వాలిటీ సెన్సెస్ డేటా ఎంతో దోహదం చేస్తుందని  రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్  భారతి హోళికేరి  తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో జీహెచ్ఎంసీ పరిధిలోనీ సెన్సెస్ -2027 సర్వే పై  ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్ లు, అదనపు ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్ ల కు ఫేజ్ 1 : హౌజ్ లిస్టింగ్, హౌజింగ్ సెన్సెస్ పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్  భారతి హోళికేరి ప్రారంభించి మాట్లాడారు. సెన్సెస్ -2027 సర్వే రెండు దశల్లో జరుగుతుందన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ మరియు గృహ గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందన్నారు. మొదటి దశ పగడ్బందీగా నిర్వహిస్తే రెండో విడత సజావుగా జరుగుతుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా  ప్రణాళికలు, పాలసీ ల రూపకల్పనలో క్వాలిటీ సెన్సెస్ డేటా ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. అంతటి ప్రాముఖ్యత గల సెన్సస్ కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో గుణాత్మకంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం సెన్సెస్ పై ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్ లు, అదనపు ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్ ల కు పూర్తి అవగాహన ఉండాలన్నారు. అప్పుడే టీమ్ కు సర్వే సరిగ్గా జరిగేలా మార్గదర్శనం చేయగలుగుతారని చెప్పారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు , క్షేత్ర సిబ్బందికి గైడ్ చేయగలుగుతారన్నారు. క్షేత్రస్థాయిలో ఏం తప్పిదాలు చేసేందుకు అవకాశం ఉందో వాటిని గుర్తించి తప్పులు జరగకుండా కాకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, జిహెచ్ఎంసి పరిధిలో  చేపట్టనున్న జనగణన లో కుటుంబాల వాస్తవ స్థితిగతులను  ప్రతిబింబిచాలన్నారు. తమ పరిధిలోని ఎన్యుమరేషన్ బ్లాక్ లో ఒక్క హౌస్ హోల్డ్ కూడా మిస్ అవ్వద్దు అన్నారు. నాణ్యమైన సమగ్ర డేటా ను సేకరించాలన్నారు. మొదటి దశ  హౌస్ లిస్టింగ్, హౌసింగ్ లెక్కలు (హెచ్ఎల్‌వో) లో భాగంగా  ఇంటి పరిస్థితులు, ఇంట్లోని సౌకర్యాలకు సంబంధించిన సమాచార సేకరణ జరుగుతుంది. రెండో దశలో దేశంలోని ప్రతి వ్యక్తికి  సంబంధించిన జనాభా, సామాజిక, ఆర్థిక వివరాలు నమోదు పక్కగా చేయిస్తామన్నారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ చంద్రకళ, మాస్టర్ ట్రైనర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Tags: