పోటీ ప్రపంచంలో ముందుండాలి

పోటీ ప్రపంచంలో ముందుండాలి

విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల లో పి ఆర్ ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో మెరిట్ రివిజన్ బుక్స్ పంపిణీ జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డిఏ ఏపిడి జంగారెడ్డి హాజరై మాట్లాడుతూ,  ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా పోటీ ప్రపంచంలో ముందుండాలని, విద్యార్థి దశలో సరైన మార్గదర్శకం ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చు అని అన్నారు. ముఖ్యంగా పరీక్షల ముందు పునఃశ్చరణకు ఇవి దోహదపడతాయని తెలిపారు. పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చలం పాండురంగారావు మాట్లాడుతూ,  వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన మెరిట్ రివిజన్ పుస్తకాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, డిఆర్డిఏ మండల సిసి విష్ణు, సీపీఐ మండల కార్యదర్శి మాజీ సర్పంచ్ దుబ్బాక భాస్కర్, జర్నలిస్టులు కలకొండ సంజీవ, చిలివేరు సంజీవ, ఈద మల్లయ్య, ఉపాధ్యాయులు,  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: