రైతులకు పారదర్శకమైన సేవలందిస్తాం

రైతులకు పారదర్శకమైన సేవలందిస్తాం

  • : ఎర్రబెల్లి గూడెం పిఎసిఎస్, పిఐసి కమిటీ.

విశ్వంభర, నెల్లికుదురు: రైతులకు పారదర్శకమైన సేవలు అందిస్తామని బాధ్యతలు పునః స్వీకరించిన పిఎసిఎస్ చైర్మన్ కొనుగోటి దేవేందర్ రావు తో పాటు పి ఐ సి కమిటీ ప్రకటించింది.న్యాయస్థానం ఆదేశాల మేరకు మండలంలోని ఎర్రబెల్లి గూడెం ప్రాథమిక సహకార సంఘం పిఐసి శుక్రవారం తిరిగి బాధ్యతలు స్వీకరించింది.చైర్మన్‌గా పొనుగోటి దేవేందర్,వైస్ చైర్మన్ ఆకుల యాకలక్ష్మి,డైరెక్టర్లుగా కోటగిరి రమేష్ గౌడ్, కొయ్యడి వెంకటేశ్వర్లు,సారంపల్లి వెంకటరెడ్డి, జేరిపోతుల వెంకటయ్య,గడ్డం కిరణ్,భూక్య యాకూబ్,బిలావత్ బాలు, గుగులోత్ శ్రీను తదితరులు బాధ్యతలు చేపట్టారు.డిసిఒ  పంపిన ఆర్డర్ కాపీలను కమిటీ సభ్యులు అధికారికంగా అందుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం, సహకార సంఘ అభివృద్ధి,గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.సీఈవో పులి సుభాష్, మహేష్, రవి తదితరులు పాల్గొని నూతన చైర్మన్,డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. పలువురు నాయకులు, రైతులు గ్రామస్తులు హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/we-provide-transparent-services-to-farmers/article-15169

Tags: