వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్‌లో వాసవి క్లబ్ గ్రేటర్, వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమంలో  భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గోదాం గడ్డ హనుమాన్ ఆలయ ఆవరణలో దాతల సహకారంతో ఒక బెంచీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ దివ్యాంగుల పాఠశాలకు రెండు ఫస్ట్ ఎయిడ్ కిట్లు, 20 శాలువాలు అందజేయడంతో పాటు మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. గోమాత కాటన్ మిల్ ఆవరణలోని గోవులకు పశుగ్రాసం పంపిణీ చేశారు. అలాగే ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రక్తదాతల వివరాలు, అత్యవసర ఫోన్ నంబర్లతో కూడిన పోస్టర్లను జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రేణుకుంట్ల శ్రీనివాస్, రీజియన్ చైర్మన్ చింత రాజేంద్ర ప్రసాద్, గంప కృష్ణమూర్తి, మాంకాల శ్రీనివాస్, జోన్ చైర్మన్ నూక సంపత్ కుమార్, వాసవి క్లబ్ అధ్యక్షుడు వనపర్తి వంశీ, ప్రధాన కార్యదర్శి కంభంపాటి సందీప్, కోశాధికారి గౌరిశెట్టి రవితేజ, వనిత క్లబ్ అధ్యక్షురాలు చొల్లేటి లత, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి మమత, కోశాధికారి మల్యాల రాధిక తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/various-service-programs-under-the-auspices-of-vasavi-club/article-17212

Tags: