బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలి
- నిందితుడికి కఠిన శిక్ష విధించాలి
విశ్వంభర, హైదరాబాదు : మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.. బాధితురాలికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లం పాడు గ్రామానికి చెందిన మైనర్ బాలికపై మహమ్మద్ పాషా అత్యాచారానికి పాల్పడి, నాలుగు అంతస్తుల భవనం పైకి తీసుకెళ్లి దారుణంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో బాలిక ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై స్పందించిన సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని బాధితురాలికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరింది. ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.