ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన శిక్షణ శిబిరం
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం బొంగ్లూర్ సమీపంలో ప్రమిద గార్డెన్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన, శిక్షణ శిబిరం నిర్వహించారు. స్థానిక ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రత్యేక సమగ్ర సవరణ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా మరియు ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేలా బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ శిక్షణా తరగతులలో బి.ఎల్.ఎ ట్రైనర్ చైతన్య కృష్ణారెడ్డి పాల్గొని, ఏజెంట్లకు కావలసిన సాంకేతిక, క్షేత్రస్థాయి విధి విధానాలపై సమగ్రమైన శిక్షణ మరియు అవగాహన కల్పించారు. ఈ శిక్షణా శిబిరంలో నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.