ఫోన్ దొంగిలించి యూపీఐ ద్వారా నగదు చోరీ.. ముగ్గురు అరెస్ట్
విశ్వంభర, సూర్యాపేట: బస్సు ప్రయాణికుల మొబైల్ ఫోన్లు దొంగిలించి, వాటిలోని మనీ యాప్‌ల యూపీఐ పిన్‌లను గుర్తించి డబ్బులు కాజేస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కె. నరసింహ గురువారం వెల్లడించారు. నంద్యాల జిల్లాకు చెందిన పాముల రాము అలియాస్ ఎరుకల రాము (23)తో పాటు ఇద్దరు మైనర్లను తుంగతుర్తి బస్టాండ్ వద్ద వాహన తనిఖీల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.70 లక్షల నగదు, 27 స్మార్ట్ ఫోన్లు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు స్వాధీనం చేసుకున్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు ఉప్పలయ్య ఫోన్‌ను బస్సులో దొంగిలించి, అతని ఖాతా నుంచి రూ.1.80 లక్షలు, అలాగే తుంగతుర్తికి చెందిన వ్యాపారి దుగ్యాల వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ.97,800 యూపీఐ ద్వారా ఇతర ఖాతాలకు బదిలీ చేసి నగదు డ్రా చేసినట్లు దర్యాప్తులో తేలింది.నిందితులు బస్టాండ్లు, బస్సుల్లో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని మొబైళ్లు దొంగిలించి, సులభమైన పిన్ నంబర్లు (1234, 0000, 1111 వంటివి) ఉపయోగిస్తున్న ఫోన్లను తెరిచి డబ్బులు కాజేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ మొబైళ్లకు, యూపీఐ యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్లు, పిన్ నంబర్లు ఉపయోగించాలని సూచించారు. కేసును ఛేదించిన డీఎస్పీ ప్రసన్న కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఎస్‌ఐలు యాదవేందర్ రెడ్డి, క్రాంతికుమార్ తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.