స్త్రీశక్తి భవనానికి శంకుస్థాపన

స్త్రీశక్తి భవనానికి శంకుస్థాపన

విశ్వంభర, అనంతగిరి :  అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో మహిళల సాధికారతకు కేంద్రంగా నూతన స్త్రీశక్తి భవనానికి శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ కంటూ లాజర్ , ఉప సర్పంచ్ గింజుపల్లి జగన్ అధ్యక్షతన నిర్వహించారు. నూతన భవనం గ్రామ మహిళలకు సమావేశాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో హరి సింగనాయక్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, భవనం మహిళలకు శక్తివంతమైన వేదికగా నిలుస్తుంది. అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గింజుపల్లి రఘు, నాయకులు ఉయ్యాల వీరయ్య గౌడ్, వార్డు సభ్యులు సూరయ్య, రామయ్య, సైదమ్మ, కల్పన, శ్రావణి నాగేంద్రబాబు, మాధవి గోపి, తదితరులు పాల్గొన్నారు.

Tags: