విద్యార్థులకు ప్రాణరక్షణ పద్ధతులపై శిక్షణ

విద్యార్థులకు ప్రాణరక్షణ పద్ధతులపై శిక్షణ

విశ్వంభర,  గుండాల: గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మండల వైద్యాధికారి డా. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హెల్త్ కేర్ వృత్తి కోర్సు విద్యార్థులకు ప్రాణరక్షక పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హృదయ ఆపత్కాల పరిస్థితుల్లో చేయాల్సిన ప్రాథమిక సహాయ చర్యలు, శ్వాస ఆడకపోవడం వంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో విద్యార్థులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మొదటి కొన్ని నిమిషాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. అలాగే స్ట్రోక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే విద్యుత్ ఆధారిత వైద్య పరికరం వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అత్యవసర వైద్య సిబ్బంది భయ్యా యాకస్వామి అంబులెన్స్‌లో అందుబాటులో ఉండే పరికరాల పనితీరును వివరించి, వాటిని ఎలా వినియోగించాలో విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్‌లు విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందజేశారు. ముఖ్య అతిథులుగా గుండాల సర్పంచ్ దేవరబోయిన అయిలయ్య, పాచిల్ల సర్పంచ్ అల్లంశెట్టి మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందికి మండల వైద్యాధికారి డా॥ ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags: