ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

 విశ్వంభర, ముషీరాబాదు : ఎల్పీజీ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి, తెలంగాణలో ఆటోలకు ఎల్పీజీ సరఫరా కొరత నివారించాలని రవిశంకర్ అల్లూరి డిమాండ్ చేశారు. హైదరాబాదు  ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాదులో ఆటోలకు ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, గ్యాస్ అవుట్‌లెట్లు పెంచాలని కోరారు. సరఫరా సక్రమంగా జరిగే వరకు ఫైనాన్సర్లు డ్రైవర్లను వేధించకుండా చూడాలని సూచించారు. రవాణా శాఖ కార్యాలయాల్లో రేడియం స్టిక్కర్ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడిని అరికట్టి, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందకిషోర్, హబీబ్, పెంటయ్య గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీధర్ రెడ్డి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: