సర్పంచులకు ఆశావర్కర్ల వినతి
విశ్వంభర, నెల్లికుదురు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల ఆశా వర్కర్లు ఆయా గ్రామాల సర్పంచి లకు సోమవారం వినతి పత్రాలను అందజేశారు. మునిగల వీడు సర్పంచి బొల్లి కొండ చైతన్య, నెల్లికుదురు పులి వెంకన్న, నైనాల యాసం సంధ్య, రావిరాల కత్తుల కళ్యాణి, ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం రాయలి భవాని ల తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆశాల సంఘం నాయకులు మహేశ్వరి,టి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆశాలకు నెలనెలా రూ.18 వేల చొప్పున స్థిర వేతనం చెల్లించాలని, సీనియార్టీ ప్రకారం ఆశాలకు ఏఎన్ఎములుగా పదోన్నతి కల్పించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని,ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని, ఎలక్షన్ వంటి డ్యూటీలకు ప్రత్యేక పారితోషకం చెల్లించాలని,ఆశలు మృతిచెందితే రూ.50వేలు దహన సంస్కారాలకు తక్షణ సహాయం అందజేయాలనే తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందజేశామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.



