ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డికి సన్మానం

 ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డికి సన్మానం

విశ్వంభర, మోత్కూరు:  మున్సిపల్ పరిధిలోని బుజిలాపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూఎస్ రాష్ట్ర రథసారధులు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షం గౌడ్, పీఆర్‌టీయూఎస్ రాష్ట్ర మాసపత్రిక ఉపసంపాదకులు ధర్మారం వెంకటయ్య ఆహ్వానం మేరకు విచ్చేసిన ఎమ్మెల్సీని పీఆర్‌టీయూఎస్ గుండాల మండల శాఖ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పీఆర్‌టీయూఎస్ అధ్యక్షుడు జంపాల రాజు, ప్రధాన కార్యదర్శి గొడుగు బాలరాజు, కార్యదర్శి కూరెల్ల రవి, జిల్లా ఉపాధ్యక్షులు గవ్వల అమరేందర్, మందుల కృష్ణయ్య, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంట్ల అమరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూదన్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఆనంద్ రెడ్డి, గుండాల మండల విద్యాధికారి మన్నె అగ్గి రాములు, మోత్కూరు ఎంఈఓ సత్యనారాయణతో పాటు పీఆర్‌టీయూఎస్ రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, క్రియాశీల సభ్యులు పాల్గొన్నారు.

Tags: