ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారులకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి : కాచం
On
- కేకే కమిటీ కాలయాపన లేకుండా ప్రతి ఒక్క ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా చూడాలి
- ఉద్యమ కారుల గుర్తింపు కమిటీకి ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్
- ఉద్యమకారులు ప్రతిపాదించిన అంశాలను కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కి నివేదిస్తాం.
- ఒక్క నిజమైన ఉద్యమకారుడికి కూడా అన్యాయం జరగకుండా ఈ హక్కులను సాధించి తీరుతాం : ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు
విశ్వంభర,హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఉద్యమకారులకు ఫ్యూచర్ సిటీలో ఒక వెయ్యి ఎకరాలు కేటాయించాలని తెలంగాణ ఉద్యమలరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడుచైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు . ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ" అధికారిక షెడ్యూల్ ప్రకారం సోమవారం అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, మరియు హైదరాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్ తదితరులు హాజరై, మూడు జిల్లాల నుండి తరలివచ్చిన ఉద్యమకారుల సలహాలను మరియు సూచనలను స్వీకరించారు.
ఈ సమావేశం లో కాచం సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో ఎల్బీనగర్ కు పత్యేక పాత్ర ఉందన్నారు . ఉద్యమ పురిటి గడ్డ ఎల్బీ నగర్ నుండే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం తాము అందరం కలిసి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు అవుతున్నా ఉద్యమ కారుల ఆశయాలు మాత్రం నెరవేరలే దన్నారు . పదేండ్లు అధికారం లో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని విమర్శించారు. 2014 లోనే ఉద్యమకారుల సంక్షేమం కోసం టీజీయుఎస్ఎస్ పేరుతో సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే దాదాపు ఐదు వందల మంది కి పైగా ఉద్యమకారులను గుర్తించి వారికి అండగా ఉంటామని బరోసా కల్పించామని తెలిపారు.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులందరూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేందుకు మద్దతుగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేయడాన్ని చేసి ఈ కమిటీలో ఉద్యమ నాయకులైన మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ లు కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి లను నియమించడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. అలాగే ఈ కమిటీ కేసులే ప్రాతిపదికగా కాకుండా 1969 ఉద్యమం లో పాల్గొన్న ఉద్యమకారులతో పాటు 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కమిటీ కాలయాపన లేకుండా అందరి సలహాలు సూచనలు తీసుకొని , తమ కార్యాచరణను విధి విధానాలను రూపొందించి అందరికీ న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ లోని ఉద్యమకారులకు ఫ్యూచర్ సిటీలో ఒక వెయ్యి ఎకరాలు కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు . తెలంగాణ ప్రాణాలకు తెగించి కొట్లాడిన ప్రతి ఒక్క ఉద్యమకారులకు తగిన గుర్తింపు న్యాయం జరగాలని వాటికోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, స్వరాష్ట్ర సాధనలో ఈ మూడు జిల్లాల ఉద్యమకారులు అత్యంత కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. రాజధాని నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో జరిగిన చారిత్రాత్మక ఆందోళనలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ విజయవంతం కావడానికి ఇక్కడి క్షేత్రస్థాయి శ్రేణులే వెన్నుముకగా నిలిచారని ప్యానల్ స్పష్టం చేసింది. ఈ రోజు సమావేశం లో ఉద్యమకారులు ప్రతిపాదించిన అంశాలను కచ్చితంగా ముఖ్య మంత్రి కి నివేదిస్తాం అని అన్నారు.సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) ద్వారా జరుగుతున్న పూర్తి స్థాయి డిజిటల్ రికార్డింగ్ ఆధారంగా, ఒక్క నిజమైన ఉద్యమకారుడికి కూడా అన్యాయం జరగకుండా ఈ హక్కులను సాధించి తీరుతాం" అని గట్టి భరోసా ఇచ్చారు.
సమావేశంలో ప్రతిపాదించిన చారిత్రాత్మక డిమాండ్లు — విధివిధానాలు:
నేటి ముఖాముఖి సంప్రదింపుల్లో జిల్లాల ప్రతినిధులు, ఉద్యమకారులు తమ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును రక్షించాలని కోరుతూ కమిటీ ముందు ఈ క్రింది ప్రధాన సంక్షేమ డిమాండ్లను ఉంచారు. వీటిపై కమిటీ సానుకూలంగా స్పందిస్తూ సమగ్ర నివేదికలో చేర్చుతామని హామీ ఇచ్చింది:
1. ఉద్యమకారుల సంక్షేమ కమిషన్‌కు చట్టబద్ధత : భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఉద్యమకారుల హక్కులకు శాశ్వత రక్షణ ఉండేలా, ఈ కమిషన్‌ను ఒక చట్టబద్ధమైన సంస్థగా మారుస్తూ చట్టం తీసుకురావాలి.
2. తదుపరి తరానికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు : నాటి పోరాటంలో సర్వస్వం కోల్పోయిన ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ విద్యాసంస్థల అడ్మిషన్లలో మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పించాలి.
3. మహిళా ఉద్యమకారులకు ప్రత్యేక ప్రయోజనాలు : స్వరాష్ట్ర సాధనలో పురుషులతో సమానంగా లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లిన మహిళా పోరాట యోధులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యతతో పాటు ప్రత్యేక సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.
4. ఉచిత రవాణా సౌకర్యం : వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో జీవితకాల ఉచిత ప్రయాణ రవాణా పాస్ సౌకర్యం కల్పించాలి.
5. ఉచిత నాణ్యమైన విద్య : గుర్తింపు పొందిన ఉద్యమకారుల పిల్లలకు లేదా వారి తదుపరి తరానికి కేజీ నుండి పీజీ వరకు పూర్తి ఉచిత, నాణ్యమైన విద్యను ప్రభుత్వమే అందించాలి.
6. 250 గజాల నివాస స్థలం : సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి నివాస అవసరాల నిమిత్తం ఉచితంగా 250 గజాల భూమిని కేటాయించి, రిజిస్ట్రేషన్ చేయించాలి.
7. గౌరవప్రదమైన నెలవారీ పెన్షన్ : వృద్ధాప్య దశలో ఉన్న ఉద్యమకారులు ఎవరిపైనా ఆధారపడకుండా, సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతకడానికి వీలుగా గౌరవప్రదమైన జీవితకాల నెలవారీ పెన్షన్ ప్రతి నెల 1వ తేదీనే అందించాలి.
8. ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు : అన్ని ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా అపరిమిత వైద్య సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్త్ కార్డులను జారీ చేయాలి.
🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-thousand-acres-should-be-allotted-to-the-activists-in/article-18565