ఉపాధి సృష్టించే స్థాయికి ఎదగాలి: ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి

విశ్వంభర, కాచిగూడ : నేటి విద్యార్థులు ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి అన్నారు. హైదరాబాదు  కాచిగూడలోని మున్నూరు కాపు సంఘం హాలులో అవంతి డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్‌ఫ్లూయెన్స్–అలుమ్ని మీట్–2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణాత్మక ఆలోచనలతో యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. నిరంతర అభ్యాసం, క్రమశిక్షణ, విలువలను అలవర్చుకుంటే విజయాలు సాధ్యమవుతాయని, విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసంపై కూడా దృష్టి సారించాలని అన్నారు. గౌరవ అతిథి ప్రొఫెసర్ ఇంద్రకంటి శేఖర్ మాట్లాడుతూ, కళాశాల విద్య డిగ్రీ సాధించడానికే కాకుండా బాధ్యతగల పౌరులను తీర్చిదిద్దేందుకు దోహదపడాలని చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాలు, కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటే ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు లభిస్తాయని, పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను ప్రస్తుత విద్యార్థులతో పంచుకొని వారికి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపక చైర్మన్, మాజీ మంత్రి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, 35 ఏళ్లుగా అవంతి విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చాయని అన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు అందించే శిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పూర్వ విద్యార్థుల విజయాలే సంస్థకు నిజమైన గుర్తింపని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యా జ్ఞాపకాలను పంచుకుంటూ అధ్యాపకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.ఏ. హమీద్, జక్కుల సత్యనారాయణ, సోనియా శ్రీకాంత్ సురంపూడి, డాక్టర్ ఎం. ప్రియాంక, ఐ. శ్రవణ్ కుమార్, ఎం.వి.ఎస్.ఎస్. నందీష్, డాక్టర్ వై. జయప్రద, ప్రొఫెసర్ ఎస్. అప్పారావు, డాక్టర్ బైస్ స్వాతి, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/professor-g-naresh-reddy-should-rise-to-the-level-of/article-18593

Tags: