అంబర్‌పేటలో నాళాల సమస్య 

అంబర్‌పేటలో నాళాల సమస్య 

విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేట్ డివిజన్‌లో నాళాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మురుగు నీరు నిల్వ ఉండటం, దుర్వాసన, దోమల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నాళాలను శుభ్రం చేయకపోవడం వల్ల పరిస్థితి విషమించిందని పేర్కొంటూ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డికి ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అనంతరం అంబర్‌పేట్ డివిజన్‌లో నాళాల సమస్యలపై అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్.వి. కర్ణన్, అశోక్ రెడ్డి, విజయ్ కుమార్ గౌడ్, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags: