ఓయూ పేపర్ కరెక్షన్‌లో అవకతవకలు

ఓయూ పేపర్ కరెక్షన్‌లో అవకతవకలు

విశ్వంభర, హైదరాబాదు : ఎగ్జామ్ పేపర్ కరెక్షన్‌లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని  లేదంటే ఉద్యమం చేపడతామని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కే అశోక్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షల్లో సుమారు 1500 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం అనుమానాలకు దారి తీసిందన్నారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసిన 1000 మంది విద్యార్థులు పాస్ కావడం, అందులో 8 మందికి ఫస్ట్ గ్రేడ్ రావడం పేపర్ కరెక్షన్‌పై సందేహాలు పెంచిందని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో జరిగిన పరీక్షల ఫలితాలు ఆలస్యంగా ప్రకటించడం, జర్నలిజం సెమిస్టర్ ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడం కూడా ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లెనిన్, రమ్య, నాగేందర్, సహన, రజనీకాంత్, ప్రవీణ్, ఆంజనేయులు, భరత్, కైలాష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/irregularities-in-ou-paper-correction/article-16570

Tags: