పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటరు పరిశీలన
విశ్వంభర, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం, సెంట్ అగస్టిన్ హైస్కూల్ కౌంటింగ్ కేంద్రంను మంగళవారం మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాం ప్రసాద్ లాల్
పరిశీలించారు, ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం సౌకర్యాలను కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తాగునీరు, చైర్స్, టెంట్స్, దివ్యాంగుల కోసం వీల్ చైర్స్, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వైద్య బృందం ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు, పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ కేంద్రానికి తరలించే క్రమంలో రిటర్నింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది మధ్య పోలింగ్ బాక్సులు తరలించాలని అన్నారు. అభ్యర్థులకు సంబంధించి ప్రచార ముందస్తు అనుమతులు, ఖర్చుల వివరాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మరిపెడ కేంద్రంలోనీ సెంట్ ఆగస్టీన్ హైస్కూల్లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు, కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు, ఆయన వెంట నోడల్ ఆఫీసర్ కృష్ణవేణి, స్థానిక మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్ సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బంది కృష్ణ ప్రసాద్, ప్రవీణ్ ఉన్నారు.



