తహసిల్దార్ కార్యాలయంలో వినూత్న నిరసన తెలిపిన రైతు
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొగుళ్ళవంపు గ్రామానికి చెందిన పాండురంగారెడ్డి అనే రైతు 15 ఏళ్లుగా భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో కాడెద్దులతో పాటు నాగలిని తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు. తనకు రావాల్సిన 3 ఎకరాల భూమిని తన పేరుతో ఆన్ లైన్ లో నమోదు చేసి పట్టాదారు పాస్ బుక్ ఇవ్వాలని 15 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందడం లేదని తెలిపారు. సమస్య పరిష్కరించపోవడంతో విసిగిపోయి తన కాడెడ్లతో రైతు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న తహసీల్దార్ అయ్యప్ప, రైతుతో మాట్లాడి పూర్తి వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని, భూ రికార్డులను పరిశీలించి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.