బండకొత్తపల్లిలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
విశ్వంభర, గుండాల: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) ఆధ్వర్యంలో బండకొత్తపల్లి గ్రామంలో పశువుల బార్క్ షెడ్లు, ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించిన చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి రైతు, అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వం కల్పిస్తున్న ఇంకుడు గుంతల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణలో ఇంకుడు గుంతలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే పశుసంవర్ధక రంగ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న బార్క్ షెడ్ల సదుపాయాన్ని ప్రతి అర్హుడు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపాలదాస్ యాదగిరి, వార్డు సభ్యులు బాదే శాంతమ్మ, బాదే యాకమ్మ-సుధాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ రేణుక, గ్రామ కార్యదర్శి నరేందర్ రెడ్డి, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.