చిట్యాల–భువనగిరి రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్
విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చిట్యాల నుంచి భువనగిరి వరకు నిత్యం భారీగా వాహనాల రాకపోకలు సాగుతున్నప్పటికీ, ఇరుకైన సింగిల్ రోడ్డు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో ఈ రహదారి విస్తరణకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. త్వరలో మంత్రి వర్యుల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రోడ్డు నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన స్థలాన్ని గురువారం రోజు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం రామన్నపేట మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని టీ స్టాల్ వద్ద కాసేపు ఆగిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం, అక్కడ ఉన్న స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి సమస్యలు, కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ, ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేను తమ మధ్య చూసిన స్థానికులు ఆనందం వ్యక్తం చేసి, పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.