అంగరంగ వైభవంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు
విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్ సర్కిల్ సాయి మారుతి నగర్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు బత్తిని రాంబాబు గౌడ్ మరియు ఆలయ అధ్యక్షులు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో పురోహితుల వేదమంత్రాలతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక కార్యకర్త ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు, వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సోమవారం ఉదయం ప్రారంభమైన బ్రహ్మోత్సవ వేడుకలు శనివారంతో ముగియ ఉన్నాయని, శాస్రోత్తమంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవ్వేతంగా జరుగుతున్నాయని తెలిపారు. మా స్వామి వారు ఎంతో మహిమగల సీతారామాంజనేయులని, భక్తుల కోర్కెలు తీర్చే కోదండ రాముడని ఆయన సేవ చేసుకోవడం ఎన్నో జన్మల పుణ్యమని అన్నారు. సాయి మారుతి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు,కాలనీ వాసులు కూడా ఎంతో ఉత్సాహంగా బ్రహ్మోత్సవాలలో పాల్గొని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ గుప్తా, జనరల్ సెక్రటరీ గడ్డం యాదగిరి, మధు , ఆర్.మల్లేష్,శ్యామ్ , మధు గౌడ్, సోమయ్య,శ్రీనివాస్,అజయ్,యాదన్న,సతీష్ ,రవి యాదవ్, జయేష్,అశోక్ రెడ్డి, రవి ప్రకాష్,ఆర్.మల్లయ్య , రాజేశ్వర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు