ప్రకృతి సేద్యం పై అవగాహన
On
విశ్వంభర,ఇనుగుర్తి: స్థానిక రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకృతి సేద్యం పై మండలంలోని రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సహజ సాగుపై అందించిన సలహాలు,సూచనలను రైతులు శ్రద్ధగా విన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ శాఖ సరఫరా చేసిన కిట్లను ఏ ఈ ఓ భాస్కర్ సంబంధిత రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము, రైతులు పాల్గొన్నారు.



