బచ్చన్నపేటలో హోలీ సంబరాలు
On
విశ్వంభర, బచ్చన్నపేట: బచ్చన్నపేట మండల కేంద్రంలో హెలీ సంబురాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ కేరింతలు, ఆనందోత్సవాల మధ్య మంగళవారం ప్రజలు హోలీ పండుగను జరుపుకు న్నారు.పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి.చిన్నారులు, యవతీయువకులు,పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. పలుచోట్ల హోలీ సందర్భంగా కామదహనం నిర్వహించారు.చిన్నాపెద్ద కలిసి ఆడిపాడుతూ.. రంగులు పూసుకుంటూ సందడి చేశారు.ఈ హోలీ వేడుకల్లో తేలుకంటి సిరి, తేలుకంటి అనికేత్,పిల్లి. సుదీక్ష,పిల్లి గణేష్, తేలుకంటి.క్రాంతికుమార్, తేలుకంటి.మోక్షిత్,ఫ్రూటీ,రుద్ర,అసదుద్దీన్,పిల్లి.దీరజ్,తేలుకంటి సంధ్య,పెనుబెల్లి రేణుక, తేలుకుంటి.కల్పన, తేలుకంటి కావ్య,పిల్లి శిరీష, తేలుకంటి,లక్షి,తేలుకంటి కనుకవ్వ, తదితరులు పాల్గొన్నారు.



