ఉపన్యాస పోటీల్లో ద్వితీయ బహుమతి

ఉపన్యాస పోటీల్లో ద్వితీయ బహుమతి

విశ్వంభర, మహబూబాబాద్: జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూస పెళ్లి గ్రామం  జడ్పిహెచ్ఎస్ స్కూల్లో  8వ తరగతి విద్యార్థి సపావట్ మల్సూర్ సత్తా చాటి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు.  శ్రీ వీరభద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని  నలంద డిగ్రీ కళాశాలలో  నిర్వహించిన డిజిటల్ విద్య వరమా? శాపమా? అనే అంశం పై  విద్యార్థి మల్సూర్ అనర్గళంగా మాట్లాడి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఆయన ప్రముఖుల చేతుల మీదుగా ద్వితీయ బహుమతి   తో పాటు రూ.1500 నగదు కూడా అందుకున్నాడు . అనంతరం  పాఠశాల హెచ్ఎం పూజారి వీరయ్య తో పాటు ఉపాధ్యాయ బృందం కలిసి విద్యార్థి  మల్సూర్ ను అభినందించారు .

Tags: