నర్సరీలను పరిశీలించిన ఎండీవో
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామంలోని నర్సరీని సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలందర్ రెడ్డి సందర్శించి అక్కడ మొక్కల పెంపకం పనులను పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వేప మొక్కలు, రేగి మొక్కల పెంపకంపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో చేపట్టనున్న వృక్షారోపణ కార్యక్రమాలకు అవసరమైన మొక్కలను సమయానికి సిద్ధం చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. వేసవి కాలం ఇప్పటికే ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున నర్సరీలో ఉన్న మొక్కలకు తగిన నీరు అందిస్తూ ప్రత్యేక శ్రద్ధతో సంరక్షణ చేయాలని ఎంపీడీఓ తెలిపారు. మొక్కలు ఎండకు గురికాకుండా అవసరమైన నీడ ఏర్పాట్లు చేయడంతో పాటు సకాలంలో నీరు పట్టాలని సూచించారు. నర్సరీలో పెంచుతున్న ప్రతి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా భవిష్యత్తులో చేపట్టే వృక్షారోపణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే నర్సరీలో పెంచుతున్న వేప మొక్కలు, రేగి మొక్కలను గ్రామంలోని ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన సూచించారు.



