రైతులకు కిట్లు పంపిణీ
On
విశ్వంభర,నెల్లికుదురు: మండలంలోని ఆలేరు గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయానికి ఎంపికైన 125 మంది రైతులకు సంబంధిత కిట్లను ఏఈఓ బెజవాడ మణికంఠ అందజేశారు. ఆలేరు రైతు వేదికలో ఏ ఈ ఓ ప్రవీణ్ ఆధ్వర్యంలో మంగళవారం సంబంధిత రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకృతి వ్యవసాయంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన దిశా నిర్దేశాన్ని అందిపుచ్చుకున్నారు. యూరియా తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలనే సందేశం పట్ల వారు ఆసక్తి కనబరిచారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.



