ఘనంగా మహిళా దినోత్సవం 

ఘనంగా మహిళా దినోత్సవం 

విశ్వంభర, హైదరాబాద్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మహిళా విభాగం ఆధ్వర్యంలో, నాగోల్ లో శుభం కన్వెన్షన్ హాల్లో, మహిళా దినోత్సవం  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు వాసవి ఆర్ట్ థియేటర్స్  అధ్యక్షుడు డాక్టర్ నీలా శ్రీధర్ అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ డాక్టర్ నీలా శ్రీధర్ ని ఘనంగా సత్కరించారు. నీలా శ్రీధర్ గత 30 సంవత్సరాలుగా  సమాజ సేవ చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ యూత్ ప్రెసిడెంట్ రాజేష్ గుప్తా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ఆర్ మూర్తి, మహిళా విభాగం అధ్యక్షురాలు  చందా భాగ్యలక్ష్మి,  ప్రధాన కార్యదర్శి  మంజుల, తదితరులు పాల్గొన్నారు.

Tags: