కలెక్టరేట్ ముందు ఆందోళన
విశ్వంభర, మహబూబ్ నగర్ : ప్రజావాణి సందర్భంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కు టిఎఫ్ టియు ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ బాధితులు సామూహిక వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ, 2018లో 523 సర్వే నంబర్ లో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలను, పట్టా సర్టిఫికెట్లను అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాటను నమ్మి మహబూబ్నగర్ అర్బన్ తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించినట్టు చెప్పారు.. ఆ సందర్భంగా బాధితులు కలెక్టర్ ని కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా కలెక్టర్ రోనాల్ రోజ్ మాట్లాడుతూ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని 2019లో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కలెక్టర్ హామీ నెరవేరకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ గత కలెక్టర్ ఇచ్చిన హామీని అమలు చేసి ప్రభుత్వ పాలన పై ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు జలాల్ పాషా, జి. గట్టన్న, డబల్ బెడ్ రూమ్ బాధితులు లలితమ్మ, శ్రీదేవి,జ్యోతి,హనీఫా బేగం,ఖాజా బేగం,టీ.అనురాధ, ధనుంజయ చారి,,చంద్రకళ, మాసమ్మ,ఫిరోజ్ బేగం, మాధవి తదితరులు పాల్గొన్నారు.



