రాఘవేంద్ర కాలనీలో ఘనంగా ఇఫ్తార్ విందు – మహేందర్ గౌడ్ సేవా కార్యక్రమం
విశ్వంభర, రాజేంద్రనగర్:రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ముస్లిం సోదరులకు ప్రముఖ వ్యాపారవేత్త నేరేటి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపవాస విరమణ చేశారు.ఈ కార్యక్రమానికి మైనార్టీ నాయకుడు ఫయుం ఖురేషి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే షాబాద్ మండలం పెదవేడు గ్రామ తొలి సర్పంచ్ గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాచన్పల్లి సీనియర్ నాయకులు వెంకటయ్య, మక్తగూడ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేరేటి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, సమాజంలో ఐక్యత మరియు సౌహార్ద్రత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు.



