బండ్లగూడ తహసిల్దార్ కు  వినతి 

 బండ్లగూడ తహసిల్దార్ కు  వినతి 

విశ్వంభర, బండ్లగూడ :-భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు జంగం మెట్ డివిజన్ ప్రెసిడెంట్  A ప్రభాకర్ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనంతరం బండ్లగూడ మండల  తహసిల్దారు గారికి వినతి పత్రం సమర్పించారు. డివిజన్ ప్రెసిడెంట్ A ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీల గారడీ ఆరు అబద్ధాలు 66 మోసాలు కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలన వైఫల్యాల ను ఎండగడుతూ ప్రజా పాలన కుంటుపడిందని కాంగ్రెస్ పాలనలో కమీషన్లకు నిలయంగా మారిందని గ్యారెంటీలను మరచి జేబులు నింపుకోవడమే పనితనంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జంగంమెట్ డివిజన్ ప్రెసిడెంట్ A ప్రభాకర్ చంద్రాయన గుట్ట బిజెపి  ఇంచార్జ్ కౌడి మహేందర్, జంగం మెట్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, జంగం మెట్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ మాజీ అధ్యక్షులు కాపర్తి శ్రీనివాస్, విజయ్ కుమార్, ప్రవీణ్, నరేష్ , భాగ్యనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఎడ్ల పండరినాథ్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags: