నిరవధిక దీక్షకు మద్దతు
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రం లో ఉన్న ఆస్పత్రిని వెంటనే వంద పడకలుగా మార్చి, నలభై కోట్ల నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక దీక్షలకు ఆలిండియా లాయర్స్ యూనియన్ మద్దతు తెలియజేసింది. అనంతరం ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడివెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగత్తయ్య, మాట్లాడుతూ, పేద ప్రజలకు ముఖ్యమైనది వైద్యం, అలాంటి వైద్యాన్ని అందించేందుకు రామన్నపేట ఆసుపత్రి కేంద్రంగా ఉందని, చుట్టూ ఏడు మండలాలకు ఆధారంగా ఉండి సేవలందిస్తున్న రామన్నపేట ఆసుపత్రిని వెంటనే వంద పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని అన్నారు. నలబై కోట్ల నిధులను కేటాయించాలిని, ఇప్పుడు నడుస్తున్న శాసనసభ సమావేశాల్లో నలభై కోట్లు నిధులు విడుదల చేయాలని వారు కోరారు.



