ఆశ వర్కర్లకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలి

ఆశ వర్కర్లకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలి

  • కలెక్టరేట్ ముందు సిఐటియు  ధర్నా

విశ్వంభర, మహబూబాబాద్: ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18 వేల  రూపాయలు ఇవ్వాలని జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి  , ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి ఉపేంద్ర ల ఆధ్వర్యంలో కలెక్టర్  కార్యాలయం ముందు వంట వార్పు నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సమ్మెట రాజమౌళి ,  ఉపేంద్ర  లు మాట్లాడుతూ, ఆశాలు గత  20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు, ఆరోగ్య సేవలు, అందిస్తున్నారు అని గుర్తు చేశారు. వీరంతా మహిళలు బడుగు , బలహీన ,వర్గాలకు చెందిన వారే అత్యధికలు ఉన్నారు అని అన్నారు. నేటికీ వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని  ఇప్పటికీ కనీసం గ్యారంటీ ఫిక్స్డ్ వేతనం కూడా  లేదని అన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది , అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు  ఫిక్స్డ్  వేతనాలు 18వేల రూపాయలు ఇస్తామని  , ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చిందని తెలియజేశారు .  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల నాలుగు నెలలు దాటింది అయినా ఇంతవరకు హామీలను నెరవేర్చలేదని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎన్ హెచ్ఎం కు నిధులు పెంచాలని  డిమాండ్ చేశారు లేని యే డల మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు . అనంతరం జిల్లా ఎడిషనల్ కలెక్టర్ లెనిన్ వచ్చల్ కు  వినతి పత్రం అందజేశారు .  ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న  , వాసం దుర్గారావు , మల్లన్న ,  సిఐటియు నాయకులు జల్లె జయరాజ్ , తోట శ్రీనివాస్ ,పాల బిందెల మల్లయ్య , జె సరిత ,కె విజయ ,రాధా ,సుజాతరేణుక  ,ఈసం సుజాత. కే విజయ. డి ఉపేంద్ర. పి రజిని. గార జ్యోతి. కాలేశ్వరి. నిర్మల. సైదమ్మ. జ్యోతి విజయ. జ్యోతి. డి సవిత. తదితరులు పాల్గొన్నారు.

Tags: