అభివృద్ధి పనులపై సమీక్షా  సమావేశం

అభివృద్ధి పనులపై సమీక్షా  సమావేశం

విశ్వంభర, మహబూబాబాద్: మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్  లెనిన్ వత్సల్ టోప్పో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బందితో నూతనంగా నిర్మాణంలో ఉన్న గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు, అంతర్గత అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ,  జిల్లాలో గ్రామపంచాయతీ భవనాలు లేని,నూతనంగా గ్రామపంచాయతీ కార్యాలయాల భవనాలు మంజూరు అయినవి, పనులు పురోగతిలో ఉన్నవి,  భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలనీ, 30  అంగన్వాడీ కేంద్రాలు మంజూరు కాగా, 23 భవనాల నిర్మాణాలు పురోగతిలో ఉన్నవి, మిగతా భవనాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  సిసి రోడ్ల, మరుగుదొడ్లు, ను వెంటనే లక్ష్యంలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్ని గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించాలని సూచించిన నేపథ్యంలో అందుకు సంబంధించి ఇదివరకే ప్రారంభమైన భవనాలను ఆర్థిక సంవత్సరం మార్చి లోగా లక్ష్యాలను పూర్తి చేయాలని, పురోగతిలో ఉన్న భవనాల నిర్మాణం కోసం సంబంధిత విభాగాల సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేసే లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ విద్యాసాగర్, అన్ని మండలాల ఎంపీడీవోలు, అసిస్టెంట్ ఇంజనీర్స్, ఎంపీ ఓలు, తదితరులు పాల్గొన్నారు.

Tags: