కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలి
- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మదిరంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి కార్యాలయ ఆవరణ శుభ్రంగా ఉంచుకోవాలని, ఫైల్స్, ఫర్నిచర్ క్రమ పద్ధతిలో పెట్టుకోవాలని పనికిరాని ఫర్నిచర్ ను డిస్పోజల్ చేసుకోవాలని , అలాగే రన్నింగ్ ఫైల్స్ ను, క్లోజింగ్ ఫైల్స్ ను వేర్వేరుగా పెట్టుకోవాలని చెప్పారు. ప్రతి ఫైలును ఈ ఆఫీసులో పంపాలని, ప్రతి కార్యాలయంలో ఇన్ వార్డు , అవుట్ వార్డు రిజిస్టర్లు , పిఆర్ రిజిస్టర్ లు సక్రమంగా నిర్వహించాలని హాజరు పట్టికలో సంతకం చేసిన తర్వాత సిబ్బంది బయటకు వెళ్ళినప్పుడు కదలికల రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లాలని, సిబ్బంది కార్యాలయమునకు హాజరు కాకపోయినాచో తప్పనిసరిగా సెలవు దరఖాస్తు సమర్పించాలని, లేనిచో అధికారి పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రతి సెక్షన్లో పెండింగ్ పనులు ఉండకూడదని, ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేయాలని, ప్రజావాణి దరఖాస్తులను కూడ పెండింగ్ ఉంచకుండ పరిష్కరించాలని ప్రతి కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని విధిగా పేస్ అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేసుకోవాలి అని చెప్పారు. ఈ సమీక్షా సమావేశం లో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ, సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



